ఆన్‌లైన్ అమ్మకాల్లో నంబర్‌వన్ పుస్తకం సెల్ఫీ ఆఫ్ సక్సెస్
Posted On July 25, 2019
* సెల్ఫీ ఆఫ్ సక్సెస్ (విజయానికి స్వీయచిత్రం) పేరిట ఆంగ్లంలో పుస్తకాన్ని రచించారు.
* అమెజాన్ ద్వారా ఈ పుస్తకాన్ని విక్రయిస్తుండగా అది విశేషాదరణ పొందుతోంది. కొత్త రచయితల పుస్తకాల విక్రయంలో అగ్రస్థానంలో నిలిచింది.
* మిలిందాగేట్స్ వంటి ప్రముఖ రచయితల పుస్తకాల కంటే ఎక్కువ రేటింగు పొందింది. అసాధారణ విజయాలకు వెంకటేశం జీవిత కథే ఒక ఉదాహరణ.
* ఆయన ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి ఐఏఎస్ సాధిచారు. పూర్వ వరంగల్ (ప్రస్తుతం జనగామ) జిల్లా కేశవాపూర్‌లో పేద కుటుంబంలో జన్మించిన ఆయన ఏడేళ్ల వయస్సులోనే తండ్రి నారాయణను కోల్పోయారు. తల్లి గౌరమ్మ నీడన పెరిగారు. ఆయన చదువు తెలుగులో సాగినా ఆంగ్లంలోనూ ప్రావీణ్యం సాధించారు.
* 1995లో తెలుగు సాహిత్యం సబ్జెక్టుగా సివిల్స్ పరీక్ష రాసి రాష్ట్రంలో మొదటి ర్యాంకుతో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు.
* ప్రస్తుతం బీసీ సంక్షేమ, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖల ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
* ఆయనకు ఇతర ఐఏఎస్ అధికారులు, మిత్రులతో పాటు యూఎస్ కాంగ్రెస్ సభ్యులు డాని కె.డేవిస్, రాజా కృష్ణమూర్తి వంటి వారి నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
* ప్రస్తుత సమాజానికి ఉపయోగపడేలా, మార్గదర్శకం అయ్యేలా ఒక పుస్తకం రాయాలనే తపన మొదటి నుంచి ఉంది. అది ఇన్ని రోజులకు కార్యరూపం దాల్చింది.
* ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి లక్ష్యం గెలుపే. దీనికి అసలైన అర్థం తెలపాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రాశాను. గెలుపు అంటే ఏమిటి?ఎందుకు? ఎలా? గెలిచిన తర్వాత ఏం జరుగుతుంది,. గెలిస్తే చాలా? ప్రపంచంలో గొప్ప వ్యక్తుల విజయాలు, వాటి పర్యవసానాలు, .ఒకరు గెలవడం వెనక ఎంత మంది ఓడిపోతున్నారు అనేది వివరించాను.
* నాకు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తి. ఆయనకు ఈ పుస్తకాన్ని అంకితమిచ్చాను. ఇది ప్రతీ ఒక్కరు కొని చదవాల్సిన పుస్తకం. విద్యార్థులు, ఉపాధ్యాయులు, నిపుణులు, అన్నివర్గాలు, రంగాల వారికి మార్గదర్శకం. త్వరలోనే దీనిని తెలుగులోకి అనువదిస్తాను.
* హిందీ, తమిళం, మలయాళం, కన్నడం వంటి భాషల్లోనూ అనువదించాలనే ఆలోచనలో ఉన్నాను. తెలుగు రాష్ట్రాల్లోని మూడో, నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం, ఉపాధ్యాయులకు నలభై శాతం ధరకే అందించాలని ప్రచురణకర్తలను కోరాను. దీనిపై వచ్చే ఆదాయాన్ని ఇబ్బందుల్లో ఉన్న వయోవృద్ధుల సంక్షేమానికి వెచ్చించాలని సూచించాను. దీని తర్వాత మరికొన్ని పుస్తకాలను రాయాలనే ఆలోచన ఉంది’’ అని వెంకటేశం తెలిపారు.