నవంబర్ 9న కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం
Posted On October 21, 2019
*నవంబర్ 9న కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించనున్నారు. పాకిస్తాన్‌లోని గురుద్వార దార్బార్ సాహిబ్ నుంచి పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలోని డేరాబాబా నానక్ వరకు ఈ కారిడార్ ఉంది.
* అంతర్జాతీయ సరిహద్దు నుంచి డేరాబాబా నానక్ వరకు కారిడార్ నిర్మాణాన్ని భారత్ ప్రారంభించింది. అటువైపు దార్బర్ సాహిబ్ వరకు కారిడార్‌ను పాక్ చేపట్టింది.
*ఈ కారిడార్ ప్రారంభంతో భారత్‌లోని సిక్కు తీర్థ యాత్రికులు వీసా లేకుండా పవిత్ర కర్తార్‌పూర్ సాహిబ్ వెళ్లవచ్చు.
*సిక్కు మత స్థాపకుడు గురునానక్ 550వ జయంతి(నవంబర్ 12) వేడుకలను జరుపకోవడానికి సిక్కులకు అవకాశం కల్పించడం కోసమే 9వ తేదీన కారిడార్‌ను ప్రారంభించనున్నారు.
*సందర్శనకు వెళ్లే ఒక్కో భక్తుడు 20 యూఎస్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.
* కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి మాజీ ప్రధా ని మన్మోహన్ సింగ్ హాజరు కావడం లేదు. ఓ సాధారణ భక్తుడిగా పాకిస్థాన్ కర్తార్‌పూర్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాకు వెళ్లనున్నారు.
*కర్తార్‌పూర్ సాహిబ్ అనేది పాక్‌లో రావి నది ఒడ్డున ఉన్న ఓ ప్రముఖ గురుద్వారా.సిక్కులు దీన్ని పవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తారు. సిక్కుల మతగురువు గురునానక్ తన జీవితంలోని చివరి 18 ఏళ్లు ఇక్కడే గడిపారు. ఇక్కడే తుదిశ్వాస విడిచారు.
*దేశ విభజన తర్వాత పంజాబ్‌లోని సిక్కులు అక్కడికి వెళ్లడానికి కష్టంగా మారింది.
* గురునానక్ 550వ జయంతి ఉత్సవాల నేపథ్యంలో కర్తార్‌పూర్ కారిడార్ నిర్మాణానికి ఇరు దేశాలూ అంగీకరించాయి.
*భారత్, పాకిస్థాన్ మధ్య కర్తార్‌పూర్ కారిడార్’ను ‘స్నేహ వారధి’గా అభివర్ణిస్తున్నారు.
* ప్రతిపాదిత ఈ మార్గం ద్వారా మన సరిహద్దు రాష్ట్రం పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి పాక్‌లోని కర్తాపూర్‌కు నేరుగా రాకపోకలు సాగించడానికి వీలు కలుగుతుంది.
*పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి 4 కిలోమీటర్లు ప్రయాణిస్తే అంతర్జాతీయ సరిహద్దు వస్తుంది. అక్కడ నుంచి పాక్ భూభాగంలో మరో 2 కి.మీ. ప్రయాణిస్తే కర్తార్‌పూర్ చేరుకుంటారు.
*పంజాబ్ నుంచి కర్తార్‌పూర్‌కు కారిడార్ నిర్మించాలని 1999లో నాటి ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి ప్రతిపాదించారు.కానీ అది అమలు కాలేదు.