మహమ్మారి వ్యాదులు
Posted On February 04, 2020
1720లో ప్లేగు వ్యాధి ప్రబలంగా, 1820లో కలరా విరుచుకుపడింది. 1920లో స్పానిష్ ఫ్లూ పంజా విసరగా, తాజాగా కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్నది.
ది గ్రేట్ ప్లేగ్ ఆఫ్ మార్సిల్లే
1720లో భారీస్థాయిలో ప్లేగు వ్యాధి ప్రబలింది. దీన్నే ‘ది గ్రేట్ ప్లేగ్ ఆఫ్ మార్సిల్లే’ అని కూడా అంటారు. ఈ మహమ్మారి కారణంగా ఫ్రాన్స్‌లోని మార్సిల్లే నగరంలో సుమారు లక్ష మంది మృత్యువాతపడ్డారు.
కలరా కల్లోలం..
1820లో కలరా కల్లోలం సృష్టించింది. తొలిసారి ఆసియాలోని థాయ్‌లాండ్, ఇండొనేషియా, ఫిలిప్పీన్స్‌లలో దీన్ని గుర్తించారు. ఈ దేశాల్లో దాదాపు లక్ష మంది కలరాకు బలయ్యారు. బ్యాక్టీరియాతో కలుషితమైన సరస్సుల్లోని నీటిని తాగడం వల్ల ఇది వ్యాప్తిచెందింది.
స్పానిష్ ఫ్లూ పంజా..
మానవ చరిత్రలోనే అత్యంత ప్రాణంతక మహమ్మారిగా ఇది నిలిచిపోయింది. 1920లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 కోట్ల మందికి ఈ వైరస్ వ్యాపించగా.. దాదాపు 10 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. నాటి ప్రపంచ జనాభాలో ఇది దాదాపు మూడు శాతం.
కరోనా.
ప్రస్తుతం కరోనా వైరస్ చైనాతోపాటు ప్రపంచదేశాలను వణికిస్తున్నది. చైనాలో ఇప్పటివరకు 360 మంది మృత్యువాతపడగా, విదేశాల్లోనూ వేగంగా వ్యాప్తిచెందుతున్నది.