భారత పారాథ్లెట్ దీపా మలిక్ వీడ్కోలు
Posted On May 13, 2020
భారత పారాథ్లెట్, రియో పారాలింపిక్స్ షాట్‌పుట్ (ఎఫ్53) ఈవెంట్ రజత పతక విజేత దీపా మలిక్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించారు. దీపా మలిక్ వీడ్కోలును మే 11న అధికారికంగా ప్రకటించింది. తాను 2019, సెప్టెంబర్ 16వ తేదీనే ఆట నుంచి తప్పుకున్నానని, ఈ మేరకు భారత పారాలింపిక్ కమిటీకి లేఖ కూడా అందజేశానని దీపా తెలిపింది. నిబంధనల ప్రకారం ఆటకు వీడ్కోలు పలికాకే 2019, ఫిబ్రవరిలో జరిగిన భారత పారాలింపిక్ కమిటీ (పీసీఐ) అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొని విజేతగా నిలిచి ఆ పదవిని స్వీకరించినట్లు 49 ఏళ్ల దీపా స్పష్టం చేసింది.