అమెరికా-తాలిబన్ల మధ్య శాంతి ఒప్పందం
Posted On March 02, 2020
*ఫిబ్రవరి 29న సుమారు పద్దెనిమిది సంత్సరాలు గా బాంబులు, తుపాకుల దద్దరిల్లుతున్న ఆఫ్ఘనిస్థాన్‌లో త్వరలో శాంతి నెలకొల్పడానికి. అమెరికా-తాలిబన్ల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది.
* ఖతర్‌లోని దోహాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అమెరికా ప్రత్యేక ప్రతినిధి జల్మీ ఖాలిల్జాద్, తాలిబన్ల ప్రతినిధి ముల్ల బారాదార్ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
*ఈ కార్యక్రమానికిఖతార్‌లో భారత రాయబారి పి కుమారన్‌తో అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్ పాంపియో పాటు పలు దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.
* ఒప్పందం ప్రకారం తాలిబన్లు ఉగ్రకార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలి. తమ ప్రాంతాల్లో ఇతర సంస్థల ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వరాదు.
*మరోవైపు అమెరికా, దాని మిత్రదేశాలు 14 నెలల్లోగా ఆఫ్ఘనిస్థాన్ నుంచి పూర్తిగా తన బలగాలను ఉపసంహరిస్తాయి.
* తొలిదశగా అమెరికా 135 రోజుల్లో 8,600 మందిని వెనక్కి రప్పిస్తుంది.
అయితేఈ ఒప్పందం అమలుకావాలంటే తాలిబన్లు, ఆఫ్ఘన్ ప్రభుత్వం మధ్య ఈ నెల 10నఈ నెల 10న నార్వే రాజధాని ఓస్లోలో ఆఫ్ఘన్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య చర్చలు సఫలం కావాలి.