జైపూర్‌కు అరుదైన గుర్తింపు
Posted On July 08, 2019
* చారిత్రక కట్టడాలతో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉన్న ఈ నగరాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతంగా గుర్తించింది.
యునెస్కో జూలై 6న వెల్లడించింది. అజర్‌బైజాన్ రాజధాని బాకులో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ 43వ సదస్సు జరుగుతోంది.
* ఈ సమావేశంలో జైపూర్ నామినేషన్‌ను పరిశీలించిన సభ్యులు ఈ నగరాన్ని ప్రపంచ వారసత్వ ప్రాంతాల జాబితాలో చేరుస్తున్నట్లు ప్రకటించారు.
* యునెస్కో ప్రధాన కేంద్రం ఫ్రాన్స్ లోని పారిస్ నగరంలో గలదు.
* 1946 నవంబర్ 4 న యునెస్కో ఏర్పడింది.
* ఐక్యరాజ్య సమితి చే డిసెంబర్ 1946 లో ప్రత్యక సంస్థగా గుర్తింపు పొందింది.