పీఎం కేర్స్ నుంచి రూ.3,100 కోట్లు
Posted On May 15, 2020
పీఎం కేర్స్ ట్రస్ట్ ఫండ్ నుంచి రూ.3100 కోట్ల నిధులను విడుదల చేసింది. వీటిలో రూ.2వేల కోట్లు వెంటిలేటర్ల కొనుగోలుకు, రూ. వెయ్యి కోట్లను వలస కార్మికుల కోసం, మరో రూ.100 కోట్లను వాక్సిన్ అభివృద్ధి కోసం కేటాయించారు. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్ల వద్ద ఉంచి కార్మికులకు వసతి, ఆహారం, వైద్యం, రవాణా సౌకర్యాలకు వెచ్చిస్తారు. కరోనాపై పోరు కోసం విరాళాలు కోరుతూ.. ప్రధాని నేతృత్వంలో హోం, రక్షణ, ఆర్థిక మంత్రులు సభ్యులుగా మార్చి 28న ఈ ట్రస్ట్ ఏర్పడిన విషయం తెలిసిందే.