ఈ– గ్రామ స్వరాజ్ పోర్టల్ ప్రారంభించిన నరేంద్ర మోదీ
Posted On April 27, 2020
పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని గ్రామాలన్నింటినీ డిజిటలీకరిస్తూ ఓ భారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘‘ఈ-గ్రామ స్వరాజ్ ’’ పేరిట పోర్టల్‌ను, యాప్‌ను, ‘స్వామిత్వ యోజన’ పేరిట వెబ్‌సైట్‌ను ఏప్రిల్ 24న ఆయన ఆరంభించారు. ఈ పోర్టల్ ద్వారా అన్ని పనులను ఎలకా్ట్రనిక్ మోడ్‌లో రికార్డు చేసి ఫోన్లలో అందుబాటులోకి తెస్తారు. గ్రామాభివృద్ధి ప్రణాళిక రూపకల్పన, పనుల పురోగతి, వర్క్-బేస్డ్ అకౌంటింగ్ అన్నీ ఈ-గ్రామ స్వరాజ్ పోర్టల్ ద్వారా చేపట్టవచ్చు. పంచాయతీరాజ్ శాఖ రూపొందించిన ఈ పోర్టల్ ద్వారా గ్రామ సచివాలయాల కార్యకలాపాలు డిజిటల్ మోడ్‌లో నిర్వహించవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా సుమారు లక్ష మంది సర్పంచులతోనూ, గ్రామ సచివాలయ ప్రతినిధులతోనూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు.