తెలుగు రాష్ట్రాల్లో జనాభా సంక్షోభం? : ఆర్థిక సర్వే వెల్లడి
Posted On July 05, 2019
* 2 దశాబ్దాల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో యుక్తవయస్కుల సంఖ్య 10% తగ్గిపోయి 60 ఏళ్ల పైబడిన వయోవృద్ధుల సంఖ్య పెరుగుతుందని పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో 2018-19 ఏడాది ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు.
* తెలుగు రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి, ఆయుఃప్రమాణాలు పెరుగుతున్నాయి. మరణశాతాలు తగ్గుతున్నాయి.
* 2015-16 నుంచి 2018-19 మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో లింగనిష్పత్తి పురోగమనంలో సాగింది.
* భేటీ బచావో- భేటీ పఢావో కార్యక్రమం పెద్ద రాష్ట్రాలపై మంచి ప్రభావాన్ని చూపింది.
* లింగనిష్పత్తి 980కి మించి ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చేరాయి. 2015-16 నాటికి ఏపీలో ఈ నిష్పత్తి 873 లోపు ఉంది.
* 5- 14 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్లో బడికి వెళ్లేవారి సంఖ్య దేశవ్యాప్తంగా తగ్గుముఖం పడుతూ వస్తోంది.
* ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌లలో 40% ప్రాథమిక పాఠశాలల్లో 50%కంటే తక్కువ పిల్లలున్నారు.
* ఏపీలో 2001లో సగటు సంతాన సాఫల్య నిష్పత్తి 2.3% ఉండగా 2041 నాటికి అది 1.5%కి చేరనుంది.
* తెలంగాణలోనూ ఇది 2.3% నుంచి 1.6%కి చేరే అవకాశం కనిపిస్తోంది.
సెన్సస్ అనగా డోర్ టు డోర్ సెర్వె.
* 1841 లో ఆధునిక సెన్సస్ ను మొదటిదారిగా ఇంగ్లాండ్ ప్రవేశపెట్టింది.
* ప్రతి పది సంవత్సరాలకు జనగణన విధానంను కూడా ఇంగ్లాండ్ ప్రవేశ పెట్టింది.
* 1851 లో సెన్సస్ ను ప్రవేశపెట్టిన ప్రతి రెండో దేశం న్యూజిలాండ్.
* 1872 లో ఇండియాలో మొట్టమొదటి సెన్సస్ నివేదిక ప్రచురణ లార్డ్ మేయో ప్రవేశ పెట్టాడు. (ఈ ప్రచురణ ఆ శాస్త్రీయమైన నివేదిక).
* 1881 లో ప్రతి 10సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ విధానం భారతలో ప్రవేశపెట్టినది లార్డ్ రిప్పన్
* 1948 లో సెన్సస్ చట్టం చేయబడినది.
* 2011 సెన్సస్ ప్రస్తుత కమిషనర్ వివేక్ జోషి
* 2011 సెన్సస్ దేశంలో 15 వది, స్వాతంత్రానంతరం 7వది
* 2011 సెన్సస్ నినాదం "Our Census Our Future"