తెలంగాణకు ఒకరు.. ఏపీకి ముగ్గురు న్యాయమూర్తులు
Posted On May 04, 2020
రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొలీజియం నలుగురు పేర్లను సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. తెలంగాణ హైకోర్టుకు ఒక న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులను నియమించారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ విజయసేన్ రెడ్డి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ కృష్ణమోహన్, జస్టిస్ సురేశ్ రెడ్డి, జస్టిస్ లలితకుమారి నియామకం అయ్యారు. రాష్ట్రపతి ఆమోద ముద్రతో అధికారికంగా నియమిస్తూ కేంద్ర న్యాయ శాఖ ప్రకటన చేసింది.