భారత్‌కు రానున్న అమెరికా అధ్యక్షుడు
Posted On February 12, 2020
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అతని భార్య మెలానియా ట్రంప్ మొదటి సారిగా భారత్ లో జరిపే ఈ పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను, ప్రజల మధ్య స్నేహాన్ని పెంచుతాయని అమెరికా ఆశిస్తుంది. ప్రధాని మోదీ ఆహ్వానంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన భార్య ఈనెల 24, 25వ తేదీల్లో పర్యటించనున్నారని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. న్యూఢిల్లీ, అహ్మదాబాద్ పర్యటనల సమయంలో ట్రంప్ దంపతులు వివిధ రంగాల వారితో ముచ్చటిస్తారు. రూ.13,500 కోట్ల విలువైన సమగ్ర గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ (ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టం)ను భారత్‌కు విక్రయించేందుకు విదేశాంగ శాఖ అంగీకారం తెలిపినది 2010–2015 సంవత్సరాల మధ్య అధ్యక్షుడిగా ఉన్న ఒబామా భారత్‌లో పర్యటించారు 2019 మే లో రెండోసారి ప్రధాని అయిన మోదీ ట్రంప్‌తో 4 సార్లు భేటీ అయ్యారు.ప్రస్తుత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్.