విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్: డిఫెండింగ్ అమెరికా విత్ గ్రిట్ అండ్ గ్రేస్
Posted On November 13, 2019
అమెరికా సైనికులను మట్టుపెట్టేందుకు ప్రయత్నించే ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆశ్రయమిస్తున్నదని భారత సంతతికి చెందిన అమెరికన్ రచయిత, ఐక్యరాజ్యసమితి(ఐరాస)లో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ పేర్కొన్నారు.
*ఇటీవల తాను రచించిన విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్: డిఫెండింగ్ అమెరికా విత్ గ్రిట్ అండ్ గ్రేస్ అనే పుస్తకంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
*మిగతా దేశాలతో పోలిస్తే, పాక్‌కు అమెరికా చాలా ఆర్థిక సహాయం చేసింది.
* 2017లో పాక్ సైన్యం అవసరాల కోసం అమెరికా 100 కోట్ల డాలర్లనిచ్చింది.
*ఐరాసలో అమెరికా దేశానికి వ్యతిరేకంగా పాక్ 76 శాతం ప్రవర్తించింది అని నిక్కీ హేలీ పేర్కొన్నారు.
*అణ్వాయుధ దేశంగా ఉన్నప్పటికీ భారత్ మీద ఏ ఒక్క దేశానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే, భారత్ ప్రజాస్వామ్య దేశం. ఇతర దేశాల్ని భయపెట్టదు అని హేలీ పుస్తకంలో వివరించారు.