దేశంలో 5 ప్రయోగశాల ప్రారంభం
Posted On January 04, 2020
*దేశ భవిష్యత్ రక్షణ అవసరాలపై అధునాతన పరిశోధనలు చేయడానికి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) యువ శాస్త్రవేత్తలతో హైదరాబాద్‌లో కొత్తగా ఒక ప్రయోగశాలను ఏర్పాటు చేసింది.
*దేశంలోని ఐదు నగరాల్లో కూడా ఇలాంటి కొత్త ప్రయోగశాలలు ఏర్పాటయ్యాయి.
*హైదరాబాద్ నగర శివారు బాలాపూర్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్‌సీఐ) మార్గంలో ఉన్న దేవతల గుట్టలో స్థాపించారు.
*డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబోరేటరీ(డీఎంఆర్ఎల్)కి చెందిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) కూడా ఇక్కేడే ఉండేది.
*అయితే, దీని స్థానంలో ప్రధాని మోడీ సర్కారు ప్రతిష్టాత్మక యువ శాస్త్రవేత్తల ప్రయోగశాలలను ఏర్పాటు చేశారు.
*హైదరాబాద్ తోపాటు బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతాలలో ఈ నూతన ప్రయోగశాలలను ఏర్పాటు చేశారు.
*స్మార్ట్ మెటీరియల్స్ పై ఇక్కడ పరిశోధనలు చేయనున్నారు.
* రక్షణ వ్యవస్థలో ఆధునాతన మెటీరియల్స్ కీలంగా ఉంటాయి.
తక్కువ వ్యయంలో రూపొందడంతోపాటు పనితీరు స్మార్ట్ గా, బహుముఖంగా ఉంటుంది.
*శత్రువుల రాడార్లు పసిగట్టడం లాంటి స్మార్ట్ మెటీరియల్స్ పై కూడా ఇక్కడ పరిశోధనలు జరుగుతాయి.
*హైదరాబాద్ తోపాటు కోల్‌కతాలోని యువ శాస్త్రవేత్తల ల్యాబ్ లకు డైరెక్టర్లుగా హైదరాబాద్ లోని డీఎంఆర్ఎల్ ఆర్సీఐ ప్రయోగశాల నుంచే ఇద్దరు శాస్త్రవేత్తలు ఎంపికయ్యారు.
*ఆర్సీఐకి చెందిన శాస్త్రవేత్త పర్వతనేని శివప్రసాద్.. కోల్‌కతాలో ఏర్పాటు చేసిన యువ శాస్త్రవేత్తల ప్రయోగశాలకు డైరెక్టర్ గా నియమితులయ్యారు.
*ఈయన ప్రస్తుతం ఆర్సీఐలో యాంటి ట్యాంక్ గైడెడ్ క్షిపణుల కోసం ఇమేజింగ్ ఇన్‌ఫ్రారెడ్ సీకర్స్ టెక్నాలజీ డిజైన్, అభివృద్ధిపై శోధనలు చేస్తున్నారు.
*డీఎంఆర్ఎల్ లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న మరో శాస్త్రవేత్త రామకృష్ణన్ రాఘవన్ హైదరాబాద్ ప్రయోగశాలకు డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
*కొత్తగా ఏర్పాటు చేసిన ప్రయోగశాలలకు నియమించిన శాస్త్రవేత్తల వయస్సు 35ఏళ్లలోపు వారే.
*అత్యాధునిక సాంకేతిక పరిశోధనల కోసం డీఆర్డీవో నిర్మించిన యువ శాస్త్రవేత్తల ప్రయోగశాలను ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరులో డిసెంబర్ 2వ తేదీన ప్రారంభించి.. వాటిని జాతికి అంకితం చేశారు.