విద్యుత్ చట్టం సవరణల బిల్లుకు కేంద్రం ప్రకటన
Posted On May 15, 2020
కేంద్ర ప్రభుత్వం తెస్తున్న 2003 విద్యుత్ సవరణ చట్టం మూలంగా విద్యుత్‌పై రాష్ట్రాలు ఆధిపత్యం కోల్పోయే స్థితి ఏర్పడనుంది. విద్యుత్ రంగంలో సమూల సంస్కరణలకు కేంద్రం శ్రీకారం చుట్టింది. విద్యుత్ రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో ఉంది. ఇప్పటివరకు విద్యుత్ సరఫరా బాధ్యతలతోపాటు కీలక అధికారాలన్నీ రాష్ట్రాలకే ఉన్నాయి. ఇక భవిష్యత్తులో రాష్ట్రాలు కేవలం బాధ్యతలకు మాత్రమే పరిమితం కాబోతున్నాయి. కీలక అధికారాలను రాష్ట్రాల నుంచి కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటోంది. విద్యుత్ పంపిణీ రంగంలో ప్రైవేటు ఫ్రాంచైజీలు, సబ్ లైసెన్సీలకు అనుమతించాలని నిర్ణయించింది దశల వారీగా విద్యుత్ సరఫరా ప్రైవేటీకరణకు ఈ నిర్ణయం దారి తీయనుంది. వినియోగదారులకు అందించే విద్యుత్ సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీలు ఇక ఉండవు