సీఏఏను వ్యతిరేకిస్తూ పంజాబ్ అసెంబ్లీ తీర్మానం
Posted On January 19, 2020
*పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేరళ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించగా.. తాజాగా పంజాబ్ ప్రభుత్వం కూడా అదే నిర్ణయం తీసుకుంది.
*సీఏఏను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అధికార కాంగ్రెస్ తీసుకొచ్చిన తీర్మానానికి పంజాబ్ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది.
*పంజాబ్‌కు మంత్రి బ్రహ్మ మోహీంద్ర ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ''కేంద్రం ప్రవేశపెట్టిన సీఏఏ, దేశ వ్యాప్తంగా అశాంతికి, నిరసనలకు కారణమైంది. స్వేచ్ఛా, సమానత్వంతో ఉన్న ప్రజాస్వామ్యానికి ఈ బిల్లు వ్యతిరేకం. మతం ఆధారంగా పౌరసత్వాన్ని కల్పించడంతో దేశంలోని కొన్ని వర్గాల భాష, సంస్కృతి ప్రమాదంలో పడే అవకాశం ఉంది.'' అని పంజాబ్ ప్రభుత్వం ఆ తీర్మానంలో పేర్కొంది.
*కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రవేశపెట్టగా.. ఒక్క భాజపా ఏకైక ఎమ్మెల్యే మినహా మిగతా సభ్యులంతా ఆమోదముద్ర వేశారు.
*మరోవైపు ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సీఏఏకు వ్యతిరేకంగా సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసిన తొలి రాష్ట్రం కేరళనే.
* కేంద్రం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 19వ తేదీన నిర్ణయించుకుంది.