షిరిడి సాయిబాబా పై రగడ ;
Posted On January 19, 2020
షిరిడి సాయి బాబా పై రగడ
ప్రస్తుతం మహారాష్ట్రలోని షిరిడీ సాయి నాధుని జన్మస్థలం గురుంచి వివాదం జరుగు
తుంది. అసలుజన్మస్థలం స్థలం షిరిడి లేదా పర్భని జిల్లా పత్రి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, ఈ మధ్య కాలంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అభివృద్ధి చేయడానికి 100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అయితే అహ్మద్నగర్ జిల్లాలోని ని షిరిడి వాసులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి కారణం ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన శిరిడి ఆలయ ప్రాధాన్యత తగ్గుతుంది అనేది వారి ఆందోళనకు కారణం .చరిత్రకారులుగోవింద్ మహారాజ్ మరియు గోవింద్దబోల్కర్ తమ పుస్తకములో షిరిడి సాయి బాబా 1835 సెప్టెంబర్ 28న పత్రిలో బ్రాహ్మణ దంపతులకు జన్మించారు అని ఐదేళ్ల బాలుడి గా ఉండగా సాయిబాబా ఒక ఫఖీర్ కు పెంచుకోవడానికి ఇచ్చినట్లు వివరించారు. ఆ రోజుల్లోనే షిరిడి సాయి బాబా ముస్లిం ప్రార్ధనా స్థలాల్లో కి వెళ్లి హిందూ దేవతల ఆరాధన అదేవిధంగా హిందూ దేవాలయాల్లో ముస్లిం దేవతల ప్రార్ధన నిర్వహించే వారని ఈ రెండూ మతస్థులు ఫిర్యాదు చేయడం వల్ల పొరుగింట్లో ఉన్న వెంకోసా అనే వ్యక్తికి బాబాని అప్పగించారని 1939 నుంచి 1951 వరకువెంకోస ఆశ్రమంలోనే శిరిడి సాయిబాబా ఉన్నాడని, పదహారేళ్ళ వయసులో షిరిడి కి వచ్చాడని వారు వివరించారు . ముంబైకి చెందిన విశ్వాస్ కేర్ సాయిబాబా పై పరిశోధనలు చేసి సాయి బాబా జన్మస్థలం పత్రియా అని కనుగొన్నాడు. బాబా జన్మస్థలంపత్రియ అని చెప్పడానికి 29 ఆధారాలు ఉన్నట్లుగా అతని పరిశోధనలో వెల్లడైంది అని ట్రస్ట్ సభ్యులు తెలిపారు .