‘లెట్ మి సే ఇట్ నౌ’
Posted On February 19, 2020
*2008లో నవంబర్ 26న 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబైలోజరిపిన విచక్షణారహిత కాల్పుల్లో 166 మంది చనిపోయారు.ముంబై మాజీ సీనియర్ పోలీస్ అధికారి రాకేశ్ మారియా తన ‘లెట్ మి సే ఇట్ నౌ’పుస్తకములో వివరించారు
*. కేసులో భాగంగా ఆనాడు కసబ్‌ను మారియా విచారించారు.
* కసబ్‌ను హిందూ ఉగ్రవాదిగా లష్కరే తోయిబా చుపించాలనుకుంది అందుకే, కసబ్ కుడి చేతికి ఎర్రని దారం కట్టిందని పుస్తకమ్ లో వివరించారు
*సమీర్ దినేశ్ చౌధరి అని, బెంగళూరు వాసి అని, ఒక నకిలీ ఐడీ కార్డును కూడా సృష్టించాయి. నిజానికి దోపిడీలు చేసి డబ్బులు సంపాదించే ఉద్దేశంతో కసబ్ లష్కరే ఉగ్రసంస్థలో చేరాడని అతడికి జిహాద్ అంటే ఏంటో కూడా తెలియదని ,అతడికి భారత వ్యతిరేకత నూరిపోశారని, . భారత్‌లో ముస్లింలను నమాజ్ చేయనివ్వరని అబద్ధాలు చెప్పారని పుస్తకము లో వివరించారు. *మారియా ఒకసారి ముంబైలో అతడిని మసీదుకు తీసుకువెల్లినప్పుడుఅక్కడ జరుగుతున్న నమాజ్‌ను చూసి కసబ్ ఆశ్చర్యపోయాడని రాసారు.
* భారత్ పంపేముందు కసబ్‌కు వారం పాటు సెలవు ఇచ్చి, రూ. 1.25 లక్షలు ఇచ్చి ఇంటికి పంపించారని,ఆ డబ్బును సోదరి వివాహానికి ఖర్చు చేయమని కుటుంబానికి ఇచ్చాడని వివరించారు.
*2012నవంబర్ 21న కసబ్‌ను పుణెలోని ఎరవాడ సెంట్రల్ జైళ్లో ఉరి తీశారు