పాక్ ఆటగాడు ఉమర్ అక్మల్‌పై మూడేళ్ల నిషేధం
Posted On April 29, 2020
పాకిస్థానీ క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై మూడు సంవత్సరాల పాటు అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుంచి నిషేధం విధిస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డిసిప్లినరీ ప్యానల్ ప్రకటించింది. ఫిబ్రవరి 20 నుంచి మూడేళ్ల పాటు ఏ ఫార్మాట్‌లోనూ ఆడకుండా అక్మల్‌పై వేటు పడింది.
ఉమర్ అక్మల్ కెరీర్‌లో 16 టెస్టులు, 121 వన్డేలు, 84 ట్వంటీ20 మ్యాచ్‌లలో పాక్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఉమర్ అక్మల్ తొలి టెస్టులోనే శతకం బాది నిరూపించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో అతను స్పాట్ ఫిక్సింగ్‌కి పాల్పడినట్లు పీసీబీ అవినీతి నిరోధక శాఖ రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. దీంతో అతన్ని పీసీబీ అవినీతి నిరోధక చట్టంలోని ఆర్టికల్ 2.4.4 ప్రకారం కేసు నమోదు చేసారు. షేర్జీల్ ఖాన్ తర్వాత అవినీతి కేసులో నిషేధం ఎదురుకుంటున్న రెండో క్రికెటర్‌గా ఉమర్ నిలిచాడు. 2017లో షేర్జీల్ ఖాన్‌పై ఐదు సంవత్సరాల పాటు నిషేధం పడింది.