నిర్మాణదశలో ఉన్న స్థిరాస్తి ప్రాజెక్టుల పై జీఎస్‌టీ గణనీయంగా తగ్గింపు
Posted On April 02, 2019
*దీనిలో ప్రధానంగా నిర్మాణదశలో ఉన్న స్థిరాస్తి ప్రాజెక్టుల జీఎస్‌టీ రేటును గణనీయంగా తగ్గించింది
* అందుబాటు గృహాలకైతే 1%, మిగతావాటికి 5 శాతం పన్ను రేట్లను వర్తింపజేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ పన్ను రేట్లు అమల్లోకి వస్తాయని చెప్పింది.
* ఇటీవల ముగిసిన జీఎస్‌టీ మండలి 34వ సమావేశంలో స్థిరాస్తికి సంబంధించి కొత్త జీఎస్‌టీ రేట్లపై చాలా వరకు స్పష్టత వచ్చింది.
*జీఎస్‌టీ అమల్లోకి రాకముందు నిర్మాణదశలో ఉన్న స్థిరాస్తి ప్రాజెక్టులకు వ్యాట్, సేవా పన్ను కలిపి 6 శాతం పన్ను రేటు ఉండేది. జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక అందుబాటు గృహాలకైతే 8%, ఇతరత్రా స్థిరాస్తులకైతే 12 శాతం మేర జీఎస్‌టీ రేటు ఉండేది.
* 2019 మర్చి 31 వరకు ఈ విధానమే కొనసాగింది. అయితే గతంలో 6 శాతంగా ఉన్న పన్ను రేటు జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక ఏకంగా రెట్టింపై 12 శాతానికి చేరడంతో స్థిరాస్తి అమ్మకాలు నెమ్మదించాయి
GST:
- ఇది ఒక పరోక్ష పన్ను
- మొదట ప్రస్తావించి నది: 2000 సం (వాజపేయి ప్రభుత్వం)
- సూచించిన కమిటీ- కేల్కర్ కమిటీ
- లోక్ సభ ఆమోదించింది: 2015
- రాజ్యసభ ఆమోదించింది: 2016
- రాష్ట్రపతి ఆమోదించింది: 2016 సెప్టెంబర్
- అమలులోకి వచ్చిన తేదీ: 2017 జులై 1
- GST రూప శిల్పి: అషీమ్ దాస్ గుప్తా
- GST కౌన్సిల్ చైర్మన్: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి