రెపోరేటు తగ్గించిన ఆర్‌బీఐ
Posted On April 04, 2019
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నేడు 2019-20 ఆర్థిక సంవత్సరానికి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించింది.
*రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ప్రస్తుతం ఉన్న రెపోరేటు 6.25శాతం నుంచి 6 శాతానికి తగ్గింది.
*దీంతో రివర్స్ రెపో రేటు 5.75శాతంగా ఉండనుంది. ఎంఎస్‌ఎఫ్ రేటు, బ్యాంక్ రేటు 6.25 శాతానికి చేరింది. ప్రస్తుతం ఉన్న విధానాన్నే కొనసాగించాలని ఎంపీసీ నిర్ణయించింది.
*వృద్ధి రేటును కొనసాగిస్తూనే వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణాన్ని 4శాతం (-/+2)వద్ద కట్టడి చేయాలని నిర్ణయించింది.
*ప్రస్తుత నిర్ణయంతో బ్యాంకులకు చౌకగా రుణాలు లభ్యమవుతాయి
- రెపోరేటు 6 శాతం
- బ్యాంక్ రేటు 6.25 శాతం
- రివర్స్ రెపో రేటు 5.75శాతం
- ఎంఎస్‌ఎఫ్ రేటు 6.25 శాతం
మానిటరీ పాలసీ కమిటీః
- ఉర్జిత్ పటేల్ కమిటీ సూచనల మేరకు ఏర్పాటు చేయబడింది:
- స్థాపన:2015
- ఎగ్జిక్యూటివ్ సభ్యుల సంఖ్య:6 (3-RBI + 3-కేంద్ర ప్రభుత్వం)
- చైర్మన్:RBI గవర్నర్
RBI:
*Established-1 april 1935.
*ACT: 1934
*Nationalised on 1 January 1949.
*Headquarters: Mumbai.
*Governor: Shaktikanta Das (25TH)
* 1ST GOVERNOR OF RBI- | Osborne Smith 1935–1937 |
---|