అడవుల్లో నివాసం ఆదివాసీల హక్కు : ఐక్యరాజ్య సమితి
Posted On July 05, 2019* అడవుల్లో నివాసం ఆదివాసీల హక్కు అని పేర్కొంది.
* రక్షిత అటవీప్రాంతాలను ఆక్రమించడం వల్ల అడవులు అంతరించిపోతున్నాయంటూ వన్యప్రాణి సంరక్షణ సంస్థలు వేసిన కేసులో ఫిబ్రవరి 13వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వం ఆదివాసీలను ఖాళీచేయించేందుకు ఉపక్రమించిన విషయాన్ని గుర్తుచేసింది.
* ఆ భూములు ఆదివాసీలవే అయినా దశాబ్దాల తరబడి వాటిని రక్షించుకోవడంలో కీలక భూమిక పోషిస్తున్న దేశీయ ప్రజలు, స్థానిక సంఘాలపై కబ్జాదారులుగా ముద్రవేస్తున్నారు’’అని ఐక్య రాజ్యసమితి మానవ హక్కుల మండలి పేర్కొంది.
* UNO మానవ హక్కుల కమిషన్ స్థానంలో కొత్తగా UNO మానవ హక్కుల మండలి ఏర్పాటు అయింది.
* 60 ఏళ్ళు క్రితం ఏర్పాటు అయినా మానవ హక్కుల కమిషన్ 2006 జూన్ 16న రద్దు కాగా మానవ హక్కుల మండలి తొలి సమావేశం 2006 జూన్ 19 జెనీవా లో జరిగింది.
* మానవ హక్కుల మండలి లో 47 దేశాలకు భారత్ తో పాటు సభ్యత్వం ఉన్నది.