ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై ఇచ్చిన తీర్పుపై సమీక్ష
Posted On September 14, 2019
*ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై గత ఏడాది ఇచ్చిన తీర్పుపై సమీక్ష జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, యు.యు.లలిత్‌లతో కూడిన ధర్మాసనం త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది.
*ఎస్సీ, ఎస్టీ చట్టం కింద అరెస్టులకు సంబంధించిన నిబంధనలను సడలిస్తూ సుప్రీంకోర్టు 2018 మార్చి 20న కొన్ని ఆదేశాలు జారీ చేసింది.
*గత ఏడాది ఇచ్చిన తీర్పు---చాలా సందర్భాల్లో ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం దుర్వినియోగం అవుతుంది,ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని తక్షణం అరెస్ట్ చేయడం కుదరదని తీర్పునిచ్చింది. ప్రభుత్వ అధికారులు ఈ చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అవడం వల్ల వారి విధి నిర్వహణకు ఆటంకం ఏర్పడుతుంది.ముందస్తు బెయిల్ ఇవ్వడంపై ఎలాంటి నిషేధాలు ఉండవు. ప్రభుత్వ అధికారులపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేసేందుకు ఉన్నతస్థాయి అధికారి అనుమతి అవసరం.
* ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా పలు సంస్థలు ఆందోళనలు చేపట్టాయి.