సచిన్ రికార్డును అధిగమించిన నేపాల్ టీనేజ్ క్రికెటర్ రోహిత్ పౌడెల్
Posted On January 28, 2019
- అంతర్జాతీయ క్రికెట్‌లో అతిపిన్న వయసులో అర్ధసెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా కొత్త రికార్డు సృష్టించాడు. యూఏఈతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 16 ఏళ్ల 146 రోజు వయసున్న రోహిత్ 58 బంతుల్లో 55 పరుగు చేశాడు.
- దీంతో సచిన్ 16 ఏళ్ల 213 రోజు వయసులో పాక్‌పై టెస్టు క్రికెట్‌లో చేసిన ఫిఫ్టీ తెరమరుగైంది. ఒక విధంగా వన్డే క్రికెట్లో ఆఫ్రిది (పాకిస్తాన్) రికార్డును కూడా రోహిత్ చెరిపేశాడు.
- ఆఫ్రిది 16 ఏళ్ల 217 రోజుల వయసులో శ్రీలంకపై 37 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇవన్నీ కూడా పురుషుల క్రికెట్‌కే పరిమితం.
- ఎందుకంటే మహిళ క్రికెట్‌లో జొమరి లాగ్టెన్‌బర్గ్ (దక్షిణాఫ్రికా) 14 ఏళ్ల వయసులోనే టెస్టు, వన్డేల్లో అర్ధసెంచరీలు చేసిన అతిపిన్న క్రికెటర్‌గా రికార్డులకెక్కింది.