రాస్ టేలర్‌కు మూడోసారి 'రిచర్డ్ హ్యాడ్లీ' పతకం
Posted On May 04, 2020
- న్యూజిలాండ్ సీనియర్ క్రికెటర్ రాస్ టేలర్‌కు ఆ దేశ అత్యున్నత క్రికెట్ పురస్కారం సర్ రిచర్డ్ హ్యాడ్లీ అవార్డు లభించింది. న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు సర్ రిచర్డ్ హ్యాడ్లీ అవార్డు టేలర్‌కు లభించింది. ఆ దేశ క్రికెట్ అత్యుత్తమ పురస్కారం ‘సర్ రిచర్డ్ హ్యాడ్లీ మెడల్’ దక్కించుకోవడం టేలర్ కెరీర్‌లో ఇది మూడోసారి.
- కరోనా వైరస్ కారణంగా ఈ అవార్డుల ప్రదానోత్సవం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఇక, టెస్టుల్లో కివీస్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా స్టీఫెన్ ఫ్లెమింగ్ (7172)ను టేలర్ (7238) ఇటీవలే అధిగమించిన విషయం మనకు తెలుసు.
- 2006లో కివీస్ తరఫున అరంగేట్రం చేసిన టేలర్.. మొత్తం 101 టెస్టులు, 232 వన్డేలు ఆడాడు. ఇక 100 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు కూడా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 2020, ఫిబ్రవరిలో భారత్‌తో జరిగిన తొలి టెస్టు ద్వారా వంద టెస్టుల మార్కును చేరాడు టేలర్. దాంతో ఏ జట్టు తరఫున చూసినా మూడు ఫార్మాట్లలో కనీసం వంద మ్యాచ్‌లు ఆడిన మొట్టమొదటి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అదే సమయంలో కివీస తరఫున వంద టెస్టులు ఆడిన నాల్గో ఆటగాడిగా నిలిచాడు. డానియల్ వెటోరి(112), స్టీఫెన్ ఫ్లెమింగ్(111), బ్రెండన్ మెకల్లమ్(101)లు టేలర్ కంటే ముందు వంద టెస్టులు ఆడిన కివీస్ ఆటగాళ్లు.