తెల్ల రేషన్‌కార్డుదారులకు ఏడాదికి రూ.5 లక్షల విలువైన వైద్య సేవలు ఉచితంగా అందుబాటులోకి వచ్చాయి
Posted On April 02, 2019* ఈ కుటుంబాలకు ప్రస్తుతం ఏడాదికి రూ.రెండున్నర లక్షల విలువైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. దీనిని రూ.ఐదు లక్షలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
* రెండు లక్షల విలువైన వైద్య సేవలు అందుబాటులో ఉండగా 2015లో రూ.రెండున్నర లక్షలు చేశారు. ఈ మొత్తాన్ని ప్రస్తుతం రూ.ఐదు లక్షలకు పెంచినందున రోగులకు ఉపశమనం కలుగుతుంది.
* ముఖ్యంగా క్యాన్సర్, గుండె జబ్బు, ఇతర ఖరీదైన వ్యాధుల బారినపడిన వారు ప్రయోజనం పొందుతారు.