2025 నాటికి భారత్ కు ఎస్-400
Posted On January 19, 2020
* భారత గగనతలం శత్రు దుర్భేద్యంగా మారనుంది. భారత్ కోసం భూ ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే ఐదు ఎస్-400 ట్రయంఫ్ దీర్ఘ శ్రేణి క్షిపణుల వ్యవస్థల తయారీని రష్యా ప్రారంభించింది.
*భారత దేశానికి 2025 నాటికి ఎస్-400 క్షిపణులను సరఫరా రష్యా సరఫరా చేయనుంది.
*భారత్‌కు అందజేయనున్న ఎస్-400 మిస్సైల్స్ ఉత్పత్తి రష్యాలో ప్రారంభమయ్యింది.
*భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మార్చి22 నుంచి రెండు రోజులపాటు రష్యాలో పర్యటించనున్నారు. *రష్యా-భారత్-చైనా త్రైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు.
*ఎస్-400 మిస్సైల్స్ ఇప్పటి వరకూ రష్యా రక్షణ శాఖకు మాత్రమే అందు బాటులో ఉండేవి. తొలిసారిగా మన దేశ రక్షణకు అండగా నిలుస్తున్నాయి.
*అమెరికా హెచ్చరికలను పట్టించుకోకుండా రష్యా నుంచి గగనతల రక్షణ క్షిపణులను కొనుగోలు చేయడానికి 2018, అక్టోబరులో భారత్ 35 వేల కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకుంది.
*చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కెమోవ్ మిలిటరీ హెలికాప్టర్ల ఒప్పందంపై కూడా త్వరలోనే ఇరు దేశాలు సంతకం చేయనున్నాయి.
*హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌తో కలిసి రష్యాకు చెందిన రెండు సంస్థలు ఈ హెలికాప్టర్లను తయారు చేస్తాయి.