సానియా మీర్జాకు ఫెడ్ కప్ హార్ట్ అవార్డు
Posted On May 13, 2020
భారత మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు 2020 సంవత్సరానికిగాను ఆసియా ఓసియానియా జోన్‌లో ఫెడ్ కప్ హార్ట్ పురస్కారం లభించింది. ఆ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయురాలుగా సానియా నిలిచింది. సానియా నాలుగేళ్ల తర్వాత ఫెడ్ కప్‌లోకి తిరిగి వచ్చి చరిత్రలో తొలిసారిగా ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది.ఈ ఏడాది జరిగిన ఓటింగ్ లో పాల్గొన వారి మొత్తం 16,985 ఓట్లలో 10,000 ప్లస్ ఓట్లను సాధించిన తరువాత సానియా ఆసియా / ఓషియానియా జోన్ అవార్డును గెలుచుకుంది.దుబాయ్‌లో మార్చిలో జరిగిన ఆసియా ఓసియానియా జోన్ క్వాలిఫయర్స్‌లో భారత్ రన్నరప్‌గా నిలిచి, 2016 తర్వాత సానియా ఫెడ్ కప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. దక్షిణ కొరియా, ఇండోనేసియా, చైనీస్ తైపీ, ఉజ్బెకిస్తాన్, చైనా జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో భారత్ రన్నరప్‌గా నిలిచింది.