ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పు నిలిపివేసిన సుప్రీం కోర్టు
Posted On January 24, 2020
*సుప్రీంకోర్టు తీర్పు- టాటా గ్రూప్ - సైరస్ మిస్త్రీ వ్యవహారంలో భారత అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం NCLAT ఆదేశాలపై స్టే ఇచ్చింది. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీ (ROC) దాఖలు చేసిన పిటిషన్‌ను నేషనల్ కంపెనీస్ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (NCLAT) తిరస్కరిస్తూ తీర్పు ఇచ్చింది. దీనిని తాజాగా సుప్రీం కోర్టు నిలుపుదల చేసింది.
*కేసు నేపథ్యం--టాటా సన్స్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తిరిగి నియమించాలంటూ ఇచ్చిన తీర్పులో కొన్ని సవరణలు చేయాలని ఎన్‌సీఎల్‌ఏటీని ఆర్‌ఓసీ(Registrar of Companies) కోరింది.
*దీనికి ఎన్‌సీఎల్‌ఏటీ నిరాకరించడంతో ఆర్‌ఓసీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
* టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ పునర్నియామకాన్ని నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు జనవరి 10న ఉత్తర్వులు జారీ చేసింది
*దీనిపై మిస్త్రీకి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
* సైరస్ మిస్త్రీని తిరిగి టాటా సన్స్ ఛైర్మన్‌గానియమించాలంటూ జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) డిసెంబరు 18న తీర్పు ఇచ్చింది.
* విచారణ మరియు తీర్పు-- ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఆర్‌ఓసీ విజ్ఞప్తిని ఎన్‌సీఎల్‌ఏటీ తిరస్కరిస్తూ ఇచ్చిన తీర్పును నిలుపుదల చేసింది.మిస్త్రీ పునర్నియామకాన్ని సవాల్ చేస్తూ టాటా సన్స్ వేసిన పిటిషన్‌తో పాటు విచారించనుంది.