ఫెరారీ జట్టుకు సెబాస్టియన్ వెటెల్ వీడ్కోలు
Posted On May 14, 2020
సెబాస్టియన్ వెటెల్ 2020 ఏడాది ఫెరారీ జట్టును వీడనున్నాడు. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఫార్ములావన్ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్. ‘మేం కలిసి పనిచేయడానికి ఇకపై అవకాశం లేదు. ఫెరారీతో నా బంధం ఈ ఏడాదితో ముగియనుంది. నేను, ఫెరారీ ఎఫ్1 టీమ్ కలిసి తీసుకున్న నిర్ణయం ఇది’ అని వెటెల్ తెలిపారు. 2015లో ఫెరారీతో వెటెల్ జతకట్టాడు. ఫెరారీ డ్రైవర్‌గా ఇప్పటి వరకు వెటెల్ మొత్తం 103 రేసుల్లో పాల్గొన్నాడు అందులో కేవలం 14 రేసుల్లో మాత్రమే విజేతగా నిలిచాడు. 2017, 2018 సీజన్‌లో డ్రైవర్ ప్రపంచ చాంపియన్ రన్నరప్‌గా నిలిచాడు.