సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు ప్రాథమిక హక్కు
Posted On January 17, 2020
*సోషల్ మీడియా వినియోగానికి సంబంధించి త్రిపుర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
* సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌లు చేయడం పౌరుల ప్రాథమిక హక్కు అని జస్టిస్ అఖిల్ ఖురేషీ స్పష్టం చేశారు.
*కేసు నేపథ్యం-- సోషల్ మీడియాలో పోస్టులు చేశారన్న కారణంగా ఒక వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా కోర్టు పైవిధంగా వ్యాఖ్యలు చేసింది. సిఎఎకు మద్దతుగా బిజెపి ఇటీవల చేపట్టిన సోషల్ మీడియా ప్రచారానికి వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ నేత ఆరిందం భట్టాఛార్జి తన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలో పోస్టులు చేశారు. బిజెపి చెప్పిన విధంగా ఒక నెంబర్ కు ఫోన్ చేస్తే మీకు సంబంధించిన సమాచారం అంతా హ్యాకర్ల వద్దకు వెళ్తుందని ఆ పోస్టులో పేర్కొన్నారు.దీనిపై వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.
*త్రిపుర హైకోర్టు తీర్పు--1.ఇప్పటికే అరెస్టయిన ఆ వ్యక్తిపై తదుపరి విచారణ చేపట్టవద్దని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు.
2.సోషల్ మీడియా పోస్టులు చేయడం అనేది ప్రాథమిక హక్కుల కిందకు వస్తుంది.ఇది ప్రభుత్వ ఉద్యోగులతోపాటు పౌరులందరికీ వర్తిస్తుంది.