దక్షిణాది చిరపుంజి అగుంబె
Posted On February 04, 2020
కర్ణాటకలోని అగుంబెను చిరపుంజి ఆఫ్ సౌత్ అంటారు.అరేబియన్ సముద్ర తీరానికి 55 కి.మీ దూరంలో పడమటి కనుమల్లోని ఈ గ్రామం ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామమే కర్ణాటకలోని షిమోగా జిల్లాలో మూడు చదరపు కి.మీచిన్న గ్రామం అగుంబే.
జనాభా దాదాపు ఐదువందలు. పక్షుల కిలకిలలు తప్ప పట్టణ ప్రాంతపు రణగొణధ్వనులేవీ ఇక్కడ వినిపించవు. పడమటి కనుమల్లో పుష్కలంగా వర్షాలు కురిసే ప్రదేశం ఇది.అగుంబె (పొగమంచుతో కూడిన అడవి అందాలు అగుంబెలో కనువిందు చేస్తాయి) ఈ ప్రదేశాన్ని దక్షిణ భారతదేశపు చిరపుంజి అని పిలుస్తారు. పశ్చిమ కనుమలకలోని ఈ ప్రదేశంలో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో అత్యధిక వర్షపాతం పడుతుంది.