పాకిస్థాన్‌లో జడ్జిగా నియమితులైన మొదటి హిందూ మహిళ సుమన్‌కుమారి
Posted On January 30, 2019
- సుమన్‌కుమారి ఖంబర్-షాదాద్‌కోట్ కోర్టు సివిల్ జడ్జిగా నియమితులయ్యారు. సుమన్‌కుమారి స్వస్థలం కూడా ఖంబర్-షాదాద్‌కోట్ జిల్లానే.
- పాకిస్థాన్‌లోని హైదరాబాద్ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన సుమన్‌కుమారి కరాచీలోని సాజ్‌బిస్ట్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.
- సివిల్ జడ్జి/జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ నియమాలకు జరిగిన పరీక్షలో సుమన్‌కుమారి 54వ స్థానంలో నిలిచారు.
- పాకిస్తాన్‌లో జడ్జిగా పనిచేసిన తొలి హిందువుగా జస్టిస్ రానా భగవాన్‌దాస్ నిలిచారు. 2005 నుంచి 2007 వరకు సుప్రీంకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా ఆయన సేవలందించారు.
Capital: Islamabad
Prime minister: Imran Khan
President: Arif Alvi
Currencies: Pakistani rupee, Rupee