వివాదాస్పద స్థలంపై సున్నీ బోర్డు కీలక ప్రతిపాదన
Posted On October 17, 2019
*వివాదాస్పద స్థలంపై తమకు గల హక్కును వదులుకోడానికి ప్రధాన కక్షిదారుల్లో ఒకటైన సున్నీ వక్ఫ్ బోర్డు సంసిద్ధత ప్రకటించింది.ఇందుకు కొన్ని షరతులు విధించింది.
*సున్ని బోర్డ్ షరతులు- 1.దేశంలోని మసీదులన్నింటికీ రక్షణ కల్పించాలి. కబ్జాలు, ఆక్రమణలు, విధ్వంసాలు జరగకుండా చట్టబద్ధ రక్షణనివ్వాలి.
2. 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి.
3.దేశంలో పురావస్తు శాఖ (ఏఎ్‌సఐ) అధీనంలో ఉన్న మసీదుల్లో ప్రార్థనలు జరుపుకునేందుకు అనుమతివ్వాలి.
4.అయోధ్యలో శిధిలావస్థకు చేరిన 22 మసీదుల మరమ్మతుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సహకరించాలి.
5.బాబ్రీను నేలమట్టం చేసినందుకు ప్ర తిగా ఓ పెద్ద మసీదును అయోధ్యలోనే వేరేచోట కట్టుకునేందుకు అనుమతించాలి.
*ఈ షరతులకు రామజన్మభూమి న్యాస్ అంగీకరించలేదు. మొదటి రెండు షరతులు- ఈ కేసు పరిధిలోకి రావనేది న్యాస్ వాదన. మిగిలిన మసీదుల ఆక్రమణ జరగరాదని, వాటిని పరిరక్షించాలని కోరడమంటే మథుర, వారాణసీలపై తమ ఉద్యమ దృష్టిని హిందూత్వ శక్తులు వదులుకునేలా షరతులు ఉన్నాయన్న కారణంతో న్యాస్ అంగీకరించలేదు.
*కేసును విచారించింది- చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్ ఎస్‌ఏ నజీర్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం.
*అలహాబాద్ హైకోర్టు -2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, వివాదాస్పద 2.77 ఎకరాల స్థలాన్ని 3ప్రధాన పక్షాలు అంటే రామచంద్రప్రభువు (దేవుడు-విగ్రహమూర్తి), నిర్మోహీ అఖాడా, సున్నీ వక్ఫ్ బోర్డులకు సమానంగా పంచాలి.ప్రధాన గుమ్మటం కింద ఉన్న ప్రదేశం దేవుడికే కేటాయించాలి.