.ట్రాన్స్ జెండర్ చట్టానికి వ్యతిరేకంగా పిటిషన్
Posted On January 29, 2020
* కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
* ట్రాన్స్‌జెండర్-2019 చట్టం రాజ్యాంగ ప్రామాణికతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు జనవరి 27వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
*పిటిషన్‌దారు వాదనలు -
1. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం రాజ్యాంగ కల్పించిన జీవించే, స్వేచ్ఛా, సమానత్వపు హక్కులకు విరుద్ధంగా ఉంది.
2.లింగ గుర్తింపుపై స్వీయ ప్రకటన అనేది ఆర్టికల్ 21 ప్రకారం ఒక ప్రాథమిక హక్కు
3.ఒక ట్రాన్స్‌జెండర్ గుర్తింపునకు సంబంధించి కేంద్రం చట్టంలో కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. పరీక్షల అనంతరం జిల్లా మెజిస్ట్రేట్ జారీ చేసే ధ్రువపత్రం ద్వారానే వారి గుర్తింపు స్థితి ఉంటుంది.
4.ఈ నిబంధనలు గోప్యత హక్కును ఉల్లంఘించేవి, ఏకపక్షంగా ఉన్నాయి.
*దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి ఎస్‌కె బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి నోటీసులు ఇచ్చింది.