శబరిమల ఆలయ బోర్డు ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆదేశం
Posted On November 20, 2019
*శబరిమల ఆలయ విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
*టీటీడీ తరహాలో శబరిమల ఆలయ బోర్డును ఏర్పాటు చేయాలని భారతదేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తెలిపింది.
* ఈ బోర్డు ఏర్పాటు కోసం ప్రత్యేక చట్టం చేయాలని కేరళ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. రెండు నెలల్లో కొత్త చట్టాన్ని కోర్టుకు సమర్పించాలని జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం ఆదేశించింది.
*శబరిమల దేవాలయంపై విచారణ సందర్భంగా టీటీడీ తరహాలో ప్రత్యేక చట్టం ఎందుకు తయారు చేయరని కేరళ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
*టీటీడీ తరహాలో ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారిని నియమించాలని సూచించింది.
*అయ్యప్ప దేవాలయాన్ని ప్రత్యేకంగా పరిగణించాలన్న ధర్మాసనం టీటీడీ తరహాలో శబరిమల ఆలయ బోర్డును ఏర్పాటు చేయాలన్న ధర్మాసనం రెండు నెలల్లో కొత్త చట్టాన్ని కోర్టుకు సమర్పించాలని కేరళ ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించింది.
*నవంబర్, డిసెంబర్ మాసంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడకు వచ్చి అయ్యప్పను దర్శించుకుంటుంటారు. అయితే..2011లో ఆలయంలో తొక్కిసలాట జరిగి 106 మంది భక్తులు చనిపోయారు. ఇంత పెద్ద ఎత్తున్న భక్తులు ఇక్కడకు వస్తున్నా..కొత్త చట్టం ఎందుకు తీసుకరావడం లేదని సుప్రీం కోర్ట్ ప్రశ్నించింది.
*10 నుంచి 50 ఏండ్ల మధ్య వయసున్న మహిళలను శబరిమల అయ్యప్ప దర్శనానికి అనుమతించరాదన్న నిబంధనను కేరళ పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు.