సీఏఏ పై స్టే కు సుప్రీం నిరాకరణ
Posted On January 22, 2020
*అంశం---పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మొత్తం 143 పిటిషన్లు దాఖలయ్యాయి. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) రాజ్యాంగ బద్దతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు జనవరి 22,2020 వ తేదీన విచారణ చేపట్టింది.
నేపథ్యం --కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సీఏఏ రాజ్యాంగ విరుద్ధమని, పౌరుల హక్కులను కాలరాస్తుందని పలు పార్టీలు సుప్రీం కోర్టుకు వెళ్ళాయి.దేశాన్ని మత ప్రాతిపదికన విభజిస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారని వివిధ సంస్థలు, సంఘాలు, రాజకీయ పార్టీలు, నాయకులు సుప్రీం కోర్టులో దాదాపు 143 పిటిషన్లు దాఖలు చేశాయి.
*సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన కేరళ ప్రభుత్వం కూడా సుప్రీంలో పిటిషన్ వేసింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత జయరామ్ రమేష్ కూడా సుప్రీంను ఆశ్రయించారు.
*సీఏఏ అమలు --జనవరి 10 నుంచి సీఏఏని అమల్లోకి వచ్చింది.
పిటిషనర్ల డిమాండ్ -- చట్టం రాజ్యాంగ చెల్లుబాటుతో పాటు సీఏఏ అమలుపై స్టే విధించాలని కోరుతూ పిటిషనర్లు డిమాండ్ చేశారు. చట్టానికి అనుకూలంగా కూడా కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి.
*సుప్రీంకోర్టు తీర్పు లోని అంశాలు --
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ చట్టంపై ఎలాంటి స్టే ఇవ్వడం లేదని ప్రకటించింది.
సీఏఏకు వ్యతిరేకంగా దాఖలైన కొత్త పిటిషన్లపై స్పందన తెలియజేసేందుకు కేంద్రానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది.
సీఏఏపై హైకోర్టులు ఎలాంటి విచారణలు చేపట్టొద్దని, ఉత్తర్వులు ఇవ్వొద్దని ఆదేశించింది.
సీఏఏను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపేందుకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు.