రైతు రుణ మాఫీకి 1200 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
Posted On August 09, 2020
రూ. 25 వేల లోపున్న రైతు రుణాలను తెలంగాణ ఆర్థిక శాఖ ఏకమొత్తంగా మాఫీ చేస్తూ రూ.1,200 కోట్లు విడుదల చేసింది. 6 లక్షల మంది రైతులకు వారి బ్యాంకు ఖాతాల్లో రూ.1200 కోట్లను అధికారులు జమ చేయనున్నారు. రూ.25 వేల కన్నా ఎక్కువ, లక్ష రూపాయల్లోపు ఉన్న వారికి నాలుగు విడతలుగా రుణచెల్లింపులు జరిగేలా చూడాలన్నారు.
జూన్‌లో వానాకాల పంటలకు ఇవ్వాల్సిన రూ. 7 వేల కోట్ల రైతు బంధు నిధులనూ విడుదల చేసినట్టు ఆర్థికమంత్రి హరీశ్‌రావు ప్రకటించారు.