నీతి ఆయోగ్ - కృత్రిమ మేధస్సు
Posted On November 28, 2019
*ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో కొత్తగా వాడుకలోకి వస్తున్న నూతన సాంకేతికత కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ)కు సంబంధించి జాతీయ స్థాయిలో పరిశోధనలకు తెలంగాణ మార్గనిర్దేశనం చేయనుంది.
*కోర్ పరిశోధనలో సాధించే ఫలితాల ఆధారంగా ప్రైవేటు రంగం సహకారంతో నూతన ఏఐ అప్లికేషన్ల రూపకల్పనపై ఇక్టయ్‌లు పనిచేస్తాయి.
*కోర్, ఇక్టయ్‌లలో ఏ రకమైన పరిశోధనలు జరగాలనే కోణంలో తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించి నీతి ఆయోగ్‌కు అందిస్తుంది.
*దేశంలో 5 సెంటర్స్ ఆఫ్ రీసెర్చ్ ఎక్సలెన్స్ (కోర్), 20 ఇంటర్నేషనల్ సెంటర్స్ ఫర్ ట్రాన్స్‌ఫర్మేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఇక్టయ్) ఏర్పాటు చేయాలని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది.
* ఏఐ సాంకేతికత తీరు తెన్నులను అర్థం చేసుకుని, మరింత పురోగతి సాధించడం లక్ష్యంగా కోర్ సెంటర్లలో పరిశోధన జరుగుతుంది. కోర్ పరిశోధనలో సాధించే ఫలితాల ఆధారంగా ప్రైవేటు రంగం సహకారంతో నూతన ఏఐ అప్లికేషన్ల రూపకల్పనపై ఇక్టయ్‌లు పనిచేస్తాయి.
* దేశంలో ఏఐ సాంకేతికతకు రూపునిచ్చేందుకు ఐరావత్ ప్లాట్‌ఫారం రూపకల్పన, పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు రూ.7,500 కోట్లు కేటాయించాలని కేంద్రానికి నీతి ఆయోగ్ ప్రతిపాదనలు సమర్పించింది.
*మూడేళ్ల పాటు ఈ నిధులను దశలవారీగా విడుదల చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.
*2035 నాటికి భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో ఏఐ వాటా సుమారు రూ.69 లక్షల కోట్లు ఉంటుందని నీతి ఆయోగ్ అంచనా వేసింది.
* వ్యవసాయం, పట్టణీకరణ, రవాణా, ఆరోగ్య రంగాల్లో కీలక సవాళ్ల పరిష్కారానికి ఏఐ ఐటీ సాంకేతికతను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారంగా భావిస్తోంది. ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2020ని 'ఇయర్ ఆఫ్ ఏఐ'(కృత్రిమ మేధో సంవత్సరం)గా ప్రకటించింది.
*మనుషుల తరహాలో యంత్రాలు ఆలోచించి, సొంతంగా నిర్ణయాలు తీసుకుని, ఆచరించడమే కృత్రిమ మేధస్సు (ఏఐ)గా పేర్కొంటున్నారు. మనుషుల గొంతులు, ముఖాలను కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు గుర్తు పట్టడం, మనం వాటికి ఇచ్చే సవాళ్లను పరిష్కరించడం, ఏదైనా పనిని అప్పగిస్తే ఏఐ సాంకేతికత పూర్తి చేస్తుంది.