సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్
Posted On January 31, 2020
*నీతిఆయోగ్ విడుదల చేసిన సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (ఎస్‌డీజీ) ఇండియా ఇండెక్స్ 2019లో రెండు కేటగిరీల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.
*అసమానత్వం తొలగించడం, వృద్ధి నమోదు చేయడం వంటి కేటగిరీల్లో తెలంగాణ తొలిర్యాంకును సాధించింది.
*మొత్తంగా ఆర్థికవృద్ధి కేటగిరీలో తెలంగాణకు 82 పాయింట్లురాగా సమానత్వం కేటగిరీలో 94 పాయింట్లు సంపాదించింది.
*మొత్తం 28 రాష్ట్రాలకు నీతి ఆయోగ్ ర్యాంకింగ్ ఇచ్చింది.
*పరిగణలోకి తీసుకున్న అంశాలు / పారామీటర్స్ --పేదరిక నిర్మూలన, ఆకలి సమస్యలు, ఆరోగ్యం, నాణ్యతతో కూడిన విద్య, లింగ సమానత్వం, తాగునీరు మరియు పరిశుభ్రత, డీసెంట్ వర్క్ మరియు ఆర్థిక వృద్ధి, పరిశ్రమలు, ఇన్నోవేషన్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అసమానత్వం, స్థిరమైన నగరాలు మరియు వర్గాలు, స్థిరమైన వినియోగం మరియు ఉత్పత్తి, వాతావరణం, శాంతి.
*ఈ మొత్తం కేటగిరీల్లోని రెండు కేటగిరీల్లో ఆంధ్రప్రదేశ్, కర్నాటకల కంటే ఎక్కువ పాయింట్లు సాధించింది తెలంగాణ. ఆర్థిక వృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌కు 78 పాయింట్లు రాగా తెలంగాణకు 82 పాయింట్లు వచ్చాయి.
*ఇక అసమానత్వం తొలగింపులో మణిపూర్(81), హిమాచల్ ప్రదేశ్ (78)లను దాటి తెలంగాణ 94 పాయింట్లు సాధించింది.
* తొలి స్థానంలో కేరళ నిలవగా రెండో స్థానంలో హిమాచల్ ప్రదేశ్ నిలిచింది. అయితే ఓవరాల్‌గా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలతో మూడో స్థానం పంచుకుంది.