Telugu Current Affairs: తెలుగు కరెంట్ అఫైర్స్ - 2020

ఇంద్రగంటి శ్రీకాంత శర్మ మృతిls-img * దాదాపు నాలుగున్నర దశాబ్దాలు సాహిత్య, పత్రికా రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖ రచయిత, కవి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ (75) కన్నుమూశారు. 
* కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ నేరేడ్‌మెట్‌లోని ఆయన స్వగృహంలో  తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
*  తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, వెంకటరత్నమ్మ దంపతుల మూడో కొడుకు శ్రీకాంత శర్మ. విజయవాడలో చాలా కాలంపాటు ఆయన జర్నలిస్టుగా పనిచేశారు.
* ఇంద్రగంటి భార్య ప్రముఖ రచయిత్రి జానకీబాల, కొడుకు ప్రముఖ సినీ దర్శకులు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ. కాగా, బంధువులు, సన్నిహితుల సమక్షంలో  అల్వాల్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. 
* 1944 మే 29న జన్మించిన ఇంద్రగంటికి.. తండ్రి హనుమత్‌ శాస్త్రి సుప్రసిద్ధ కవి కావడంతో సహజంగానే సాహిత్యం ఒంటబట్టింది. విద్యార్థి దశనుంచే ఆయన రచనావ్యాసాంగాన్ని చేపట్టారు. * చిన్నవయసులోనే అభ్యుదయ కవిగా ప్రసిద్ధులయ్యారు. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి వారపత్రికలో సబ్‌ఎడిటర్‌గా పనిచేశారు. 
* 1976లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో సహాయ సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహించారు. రేడియోలో నాటికలు, డాక్యుమెంటరీలు, సంగీత రూపకాలకు ప్రాణం పోశారు.
*  ఆ తర్వాత ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికకు సంపాదకులుగా కూడా ఇంద్రగంటి శ్రీకాంత శర్మ పనిచేశారు. ఇటీవలే ఆయన ’ఇంటిపేరు ఇంద్రగంటి’పేరుతో తన ఆత్మకథను వెలువరించారు.
*  గత యాభై సంవత్సరాల్లో తానెరిగిన సాహిత్య జీవితాన్ని, అలాగే తన కుటుంబ విశేషాలను, రచయితగా తన అనుభవాలను కలగలిపి ఈ ఆత్మ కథ రాసి 2018 జనవరిలో విడుదల చేశారు.
* దాదాపు నాలుగున్నర దశబ్దాల సాహితీ ప్రస్థానంలో కవిత్వం, విమర్శలు, నాటకాలు, నవలలు 20కిపైగా పుస్తకాలు రాశారు. రచయితగా, కవిగా, పాత్రికేయుడిగా, సంపాదకులుగా ఆయన సాహిత్యరంగంలో చేసిన సేవలకుగాను పలు జాతీయ స్థాయి పురస్కారాలు, వివిధ సంస్థల నుంచి అవార్డులను అందుకున్నారు.
*  తెలుగు సాహిత్యంలో గుడిపాటి వెంకటాచలం, కృష్ణశాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, శ్రీశ్రీ, బుచ్చిబాబు, బాల గంగాధర్‌ తిలక్, విశ్వనాథశాస్త్రి, అజంతా రచనలతో ఆయన బాగా ప్రభావితమయ్యారు. 
* శ్రీకాంత శర్మ 20కి పైగా సినిమాలకు పాటలు కూడా రాశారు. జంధ్యాల దర్శకత్వం వహించిన ’నెలవంక’చిత్రంలో 6పాటలు రాశారు. ఇందులో ’ఏది మతం’పాటకు జాతీయ అవార్డు వస్తుందని అనుకున్నారు.
*  ఆ తర్వాత జంధ్యాల దర్శకత్వంలోనే ’పుత్తడిబొమ్మ’సినిమాకు రెండు పాటలు, ’రావు–గోపాల్రావు’చిత్రంలో ఓ పాట రాశారు. ’కృష్ణమూర్తి కుక్కపిల్లలు’అనే టెలీఫిలిం కోసం ఓ పాట రాశారు. తనయుడు మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ’గోల్కొండ హైస్కూల్‌’సినిమాలో ’ఏనాటివో రాగాలు’పాటను, ‘అంతకు ముందు ఆ తర్వాత’చిత్రంలో ’నా అనురాగం’పాటను, ’సమ్మోహనం’లో ’మనసైనదేదో’పాటను రాశారు. 
*74 సంవత్సరాల వయసులో ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లోనూ ’సమ్మోహనం’కోసం ఆయన రాసిన ఫుల్‌ రొమాంటిక్‌ సాంగ్‌ అందరినీ ఆకట్టుకుంది.  
Related Articles

Telugu Current Affairs e-Magazine

Current affairs Telugu updates here by our dedicated team daily basis. Use filter option to find Telugu current affairs by date, category, regional. You also find Telugu Current Affairs bitbanks, detailed articles for essay writing, Monthly Current affairs online tests in one place. Vyoma Telugu Current affairs is a crucial component for competitive exam and we committed to giving the best quality current affairs material. Vyoma provides Telugu Current Affairs Monthly Pdf e-magazine.

Telugu Current Affairs Online Exams

Current affairs Telugu updates here by our dedicated team daily basis. Use filter option to find Telugu current affairs by date, category, regional. You also find Telugu Current Affairs bitbanks, detailed articles for essay writing, Monthly Current affairs online tests in one place. Vyoma Telugu Current affairs is a crucial component for competitive exam and we committed to giving the best quality current affairs material. Vyoma provides Telugu Current Affairs Monthly Pdf e-magazine.

 • January-20 CA COMBO-T/M
 • Current Affairs COMBO
 • 200 ప్రశ్నల 2 కరెంట్ అఫైర్స్ ప్యాకేజీ రూ 60/- మాత్రమే
 • Total Exams - 2
 • Total Questions - 200
 • Price - Rs. 90   ₹60
 • DETAILS REGISTER
 • JAN-20 CA TEST-1 T/M
 • January 2020 Current Affairs Level 1
 • 100 ప్రశ్నల కరెంట్ అఫైర్స్ ప్యాకేజీ కేవలం రూ 30/- మాత్రమే
 • Total Exams - 1
 • Total Questions - 100
 • Price -   ₹30
 • DETAILS REGISTER
 • JAN-20 CA TEST-2 T/M
 • January 2020 Current Affairs Level 2
 • 100 ప్రశ్నల కరెంట్ అఫైర్స్ ప్యాకేజీ కేవలం రూ 30/- మాత్రమే
 • Total Exams - 1
 • Total Questions - 100
 • Price -   ₹30
 • DETAILS REGISTER

Download Mobile APP

Andhra Pradesh Grama Sachivalayam | Vyoma Exams Preparation App