ఉపాధి నిధుల వ్యయం రూ.9216 కోట్ల వినియోగం తో ఏపీ రికార్డు
Posted On April 02, 2019
*వేతన వ్యయంలో ప్రకాశం జిల్లా రూ.1000 కోట్లను దాటింది. జాతీయ స్థాయిలో సగటు వేతన రేటు రూ.179.29 ఉండగా రాష్ట్రం రూ.199.17తో ఉందని వివరించారు.
* దేశవ్యాప్తంగా సగటున 50.28 శాతం కుటుంబాలకు పని కల్పించగా రాష్ట్రంలో 58.21 శాతం కుటుంబాలకు పని కల్పించామని వెల్లడించారు.
* మహిళల హాజరు శాతం దేశవ్యాప్తంగా సగటున 54.48 శాతం ఉండగా రాష్ట్రంలో సగటున 59.78 శాతం ఉందని తెలిపారు.
* 8.54 లక్షల కుటుంబాలకు 100 రోజుల పని దినాలు కల్పించినట్లు వెల్లడించారు. 15 రోజుల వ్యవధిలోనే 98.78 శాతం వేతనాల చెల్లింపు జరిగిందన్నారు.
**జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 (ఎన్.ఆర్.ఇ.జి.ఎ) అనేది దేశంలో గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించటానికి ప్రయత్నించే సాంఘిక భద్రతా పధకం.
*2006 లో 200 జిల్లాలలో అమలు చేయబడింది.
*2008 నాటికి ఇది మొత్తం దేశమంతటా అమలు అయ్యింది. ఈ పథకం గ్రామీణ ఉపాధికి కనీస ఉద్యోగ హామీని ప్రతి ఆర్థిక సంవత్సరానికి 100 రోజులు నమోదు చేసి పని అందించడానికి రూపొందించబడింది