ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ః ఏడీబీ
Posted On April 04, 2019
ఏషియన్ డెవలప్‌మెంట్ ఔట్‌లుక్ 2019 నివేదిక ప్రకారం 2019-20లోనూ ప్రపంచంలో అత్యంత వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగనుందని వెల్లడించింది.
*దేశీయంగా చూస్తే పన్ను వసూళ్లు తగ్గడం,అంతర్జాతీయ గిరాకీ మందగించడం,కీలక రేట్ల కోత, రైతులకు ఆదాయ దన్ను వంటి కారణాల వలన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో వృద్ధి 7.2 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది.
*బలహీన వ్యవసాయ ఉత్పాదకత, వినియోగం, అధిక చమురు ధరలు, తక్కువ ప్రభుత్వ వ్యయాలు ప్రభావం చూపాయని తెలిపింది. 2019లో వృద్ధి 7.2 శాతానికి పెరగొచ్చని, 2020లో 7.3 శాతం నమోదు కావొచ్చని అంచనా వేసింది
*ఆహార వస్తువులు ధరలు, దేశీయ గిరాకీ వంటి వాటి వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 4.3 శాతానికి చేరుతుంది.
*2020-21కి 4.6 శాతానికి చేరుతుంది.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరెంటు ఖాతా లోటు 2.4 శాతానికి , 2020-21 నాటికి 2.5 శాతంగా ఉంటుందని నివేదించింది.
• ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఆసియా మరియు పసిఫిక్ దేశాలకు రుణాలు, గ్రాంట్లు, విధాన సాయం, సాంకేతిక సహాయం మరియు ఈక్విటీ పెట్టుబడులను అందించే ఒక అంతర్జాతీయ సంస్థ.
• ఇది 22 ఆగష్టు 1966 న ప్రాంతీయ అభివృద్ధి బ్యాంకు లాగా స్థాపించబడింది మరియు దీని ప్రధాన కార్యాలయం మనీలా, ఫిలిప్పీన్స్ లో ఉంది.
• ఎడిబి దాని స్థాపన సమయంలో 31 సభ్య దేశాలు ఉండేవి, ఇప్పుడు 67 సభ్య దేశాలను కలిగి ఉంది, వీటిలో 48 ఆసియా మరియు పసిఫిక్ ప్రాంతాల లోపల ఉండగా 19 బయట ఉన్నాయి
- Asian Development Bank Headquarters: Manila, Philippines
- President: Takehiko Nakao.