పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతి
Posted On March 06, 2020
*ప్రఖ్యాత పాత్రికేయుడు ,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు మార్చి 5న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు.
* గుంటూరు జిల్లా పొత్తూరులో 1934 ఫిబ్రవరి 8న జన్మించినారు.
*1957లో తన సమీప బంధువైన బీవీ రాజు సారథ్యంలో వెలువడిన ఆంధ్రజనత పత్రిక ద్వారా జర్నలిజంలోకి ప్రవేశించారు.
* 2005లో అప్పటి ప్రభుత్వం మావోయిస్టులతో జరిపిన చర్చల్లోనూ పొత్తూరి ప్రతినిధిగా పాల్గొన్నారు.
* 1957లో ఆంధ్ర జనతా పత్రికతో పాత్రికేయ వృత్తి ప్రారంభించారు.
* తర్వాత ఆంధ్రభూమి, ఈనాడు, ఆంధ్రప్రభ తదితర పత్రికల్లో పని చేశారు.
*2000 సంవత్సరంలో ఆయన రాసిన నాటి పత్రికల మేటి విలువలు పుస్తకం, 2001లో విడుదలైన చింతన, చిరస్మరణీయులు పుస్తకాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి.
* ఆత్మకథ‘విధి నా సారథి’ పేరుతో రాశారు.