హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో కాలుష్య కారక పరిశ్రమల విస్తరణ అనుమతులు సడలించిన ప్రభుత్వం
Posted On April 25, 2019- మెదక్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్ నాలుగు పాత జిల్లాల పరిధిలోని 51 పారిశ్రామిక వాడలు, పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్యం అధికంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో కాలుష్య కారక కొత్త పరిశ్రమల ఏర్పాటుపై, అప్పటికే ఉన్నవాటి విస్తరణపై రెండు దశాబ్దాల క్రితం నిషేధం విధించారు.
- కొత్త పరిశ్రమల ఏర్పాటుపై ఉన్న నిషేధం మాత్రం యథాతథంగా కొనసాగుతుందని రాష్ట్ర పర్యావరణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
- కాలుష్య రహిత పరిస్థితుల్ని పునరుద్ధరించేవరకు పరిశ్రమల విస్తరణకు ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దు..’’ అని ఎన్జీటీ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. దీంతో పాటుగా ఏదైనా పారిశ్రామిక యూనిట్ విస్తరణతో ప్రజాప్రయోజనం ఉంటుందని అనుకుంటే పరిశీలించవచ్చని అయితే, ఆ కంపెనీలో వ్యర్థాలను బయటకు వదలని జీరో లిక్విడ్ డిశ్చార్జ్ (జడ్‌ఎల్‌డీ) ఏర్పాట్లు ఉండాలని వివరించింది.
- పటాన్‌చెరు-బొల్లారం రిలీఫ్ ఫండ్ ఏర్పాటు చేసి ఆయా కంపెనీల టర్నోవర్‌లో 1 శాతం మొత్తాన్ని అందులో డిపాజిట్ చేయాలి’’ అని ఎన్జీటీ షరతులు విధించింది. ఈ నేపథ్యంలో గతంలో విధించిన నిషేధం ఉత్తర్వులను రద్దు చేయాలని కొత్త పరిశ్రమల ఏర్పాటు, విస్తరణకు అనుమతించాలని బల్క్‌డ్రగ్ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.
- పరిశ్రమల ఏర్పాటు, విస్తరణ నిషేధంపై గతంలో జారీ చేసిన 95, 64 జీఓలకు సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీఓ 24 జారీ చేసింది.