కాంచీపురంలో అత్తివరధర్ ఉత్సవాలు ప్రారంభం
Posted On July 02, 2019
* స్థానిక వరదరాజ పెరుమాళ్ దేవాలయంలోని వసంత మంటపంలో ఈ ఉత్సవాలను రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ప్రారంభించారు.
* 40 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఉత్సవాలు ఆగస్టు 17 వరకు 48 రోజులపాటు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.
* దీనిలోభాగంగా ఆలయ ప్రాంగణంలో ఉన్న అనంత సరస్సు (పుష్కరిణి)లోని నాలుగు కాళ్ల మంటపం నుంచి అత్తివరధర్ విగ్రహాన్ని కి హోమాలు, యాగాలు నిర్వహించారు.
* తొలుత 24 రోజులపాటు స్వామివారు శయన ఆకారంలో, తర్వాత 24 రోజులు నిలుచున్న ఆకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.