అయోధ్య అసలు కథ
Posted On November 09, 2019
*1822లోనే ఫైజాబాద్ కోర్టు అధికారి హఫీజుల్లా దీన్ని ఓ వివాదంగా ఓ కేసులో పేర్కొన్నారు. కానీ తొలి వ్యాజ్యం మాత్రం 1857లో పడింది.
*బాబ్రీ మసీదులో పనిచేసే మౌల్వీ మొహమ్మద్ అస్ఘర్ దీన్ని వేశారు.
*అయోధ్య నగరం మధ్యలో ఉన్న హనుమాన్ గఢీ మహంత్ బాబ్రీ మసీదు తూర్పు ప్రాంతాన్ని బలవంతంగా లాక్కున్నారని ఆయన అందులో ఆరోపించారు.
* హనుమాన్ గఢీలోనే వైష్ణవ బైరాగులనేక మంది ఉండేవారు. ఈ కేసుపై ప్రతిగా వారూ ఓ కేసు దాఖలు చేశారు.
*బాబ్రీ మసీదు స్థలం రాముడు పుట్టిన చోటు అని పేర్కొంటూ, వైష్ణవ సంప్రదాయాలను అనుసరించే ధార్మిక సంస్థగా తమకు దానిపై చట్టపరంగా హక్కు ఉందని చెబుతూ 1857లో - ఈ సాధువులకు చెందిన ‘నిర్మోహీ అఖాడా’ కేసు వేసింది. ఈ రెండింటినీ విన్నాక బ్రిటిష్ ప్రభుత్వం అక్కడ మధ్యలో ఓ గోడ కట్టించి, హిందువులంతా తూర్పు వైపు నుంచీ, ముస్లింలు ఉత్తరం వైపు గేటు నుంచి ప్రవేశించాలని ఆదేశించింది. 1860-84 మధ్య అనేక కేసులు దాఖలయ్యాయి.
*అతి ముఖ్యమైన కేసు మాత్రం 1885లో పడింది. రామ జన్మస్థానానికి తానే మహంత్‌నని ప్రకటించుకుంటూ- మసీదు ఆవరణలో- రామ్ చాబుత్రా వద్ద రామాలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ రఘువర్ దాస్ అనే ఓ ధార్మిక నేత ఓ కేసు వేశారు.
*దీన్ని కోర్టు 1986లో కొట్టేసింది. అయితే హిందువులు రామజన్మభూమిగా బాబ్రీమసీదు ప్రాంతాన్ని స్థిరపరిచేందుకు ఇది దోహదపడింది. అక్కడ నుంచీ 1923దాకా అనేక వ్యాజ్యాలు నడిచాయి.
*1949 అర్థరాత్రి బాబ్రీ మసీదులోపల- కొందరు వ్యక్తులు బలవంతంగా సీతా రామలక్ష్మణుల విగ్రహాలను పెట్టారన్న వివాదం- దేశ చరిత్రలోనే అతి పెద్ద వివాదంగా రూపుదాల్చింది.
*బ్రీ మసీదు అనేది వివాదాస్పద ప్రాంతమనీ పేర్కొంటూ- యథాతధ స్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ ఫైజాబాద్ కోర్టు 1949 డిసెంబరు 29న కీలకమైన తీర్పునిచ్చింది.
*ప్రధాన గేటుకు తాళం వేశారు. ముస్లింలకు లోపలికి వెళ్లడానికి అనుమతి నిరాకరించారు. హిందూ విగ్రహాలకు పూజల నిమిత్తం ఓ నలుగురు పూజారులను అనుమతిచ్చారు.
* ఓ సైడు గేటు వెలుపలి నుంచి హిందువులకు దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు. హిందూ మహాసభ కార్యకర్త గోపాల్ సింగ్ విశారద్ 1950 జనవరి 16న ఓ కేసు వేశారు. ‘‘అక్కడున్న విగ్రహాలు ఎప్పటికీ తొలగించరాదు. ఎటువంటి అడ్డంకులూ లేకుండా పూజలు చేసుకోనివ్వాలి... ’’ అన్నది ఆ కేసు.
* అది రాముడు పుట్టినచోటనీ తమకు దాన్ని అప్పగించేయాలని నిర్మోహీ అఖాడా 1959లో ఓ పిటిషన్ దాఖలు చేసింది.
*వీటన్నింటినీ చూశాక 1961 డిసెంబరు 18న సున్నీ వక్ఫ్ బోర్డు రంగప్రవేశం చేసింది. బాబ్రీ మసీదును బాబర్ కట్టించాడనీ, అది తమకే చెందుతుందనీ వాదించి అప్పగించాలని కోరింది.
* అలహాబాద్ హైకోర్టు త్రిసభ్య బెంచ్ తీర్పు ——-2010 జూలై 26న అలహాబాద్ హైకోర్టు త్రిసభ్య బెంచ్ తీర్పును వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద ప్రాంతాన్ని మూడు పక్షాలకూ సమంగా కేటాయిస్తూ సమన్యాయం చేస్తున్నట్లు జస్టిస్ సుధీర్ అగర్వాల్, జస్టిస్ డీవీ శర్మ, జస్టిస్ ఎస్‌యూ ఖాన్‌లతో కూడిన ధర్మాసనం ప్రకటించింది.
*కేంద్ర గుమ్మటం కింద- విగ్రహాలున్న చోటును రామ్‌లాలాకు వదిలివేయాలని పేర్కొంది. రామ్ చబుత్రా, సీతా రసోయి మధ్య ఉన్న చోటును నిర్మోహీ అఖాడాకు, ఇతర గుమ్మటాల కింది ప్రాంతాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించింది.
*ఆలయాన్ని కూల్చి బాబ్రీ మసీదును బాబర్ చక్రవర్తి కట్టాడన్న విషయంలో జడ్జీలు విభేదించారు. ఇద్దరు హిందూ జడ్జీలూ ఆలయాన్ని కూల్చి కట్టినట్లుగా పురావస్తు నివేదికలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొనగా- ఇది నిజం కాదనీ, ఏ ఆలయాన్నీ కూల్చి కట్టిన దాఖలాలు లేవని ముస్లిం జడ్జి ఎస్‌యూ ఖాన్ అభిప్రాయపడ్డారు.
*1949లో ఫైజాబాద్ జడ్జి తీర్పు దరిమిలా వేసిన తాళాలు తెరవాలని 1986లో ఆదేశాలు వెలువడ్డాయి.
*అయోధ్య వివాదానికి సంబంధించిన కేసులన్నీ అలహాబాద్ హైకోర్టు- లఖ్‌నవూ బెంచ్‌కు బదిలీ అయ్యాయి. గోపాల్‌సింగ్ విశారద్ వేసినది మొదటి కేసుగా, రామచంద్రదాస్ పరమహం్‌సది రెండో కేసుగా (దీన్ని ఆ తరువాత ఉపసంహరించారు), నిర్మోహీ అఖాడాది మూడో కేసుగా, సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుది నాలుగో కేసుగా పరిగణించారు.
*1989లో దేవుడిని (రామ్‌లాలా) సైతం కక్షిదారుగా చేశారు. బాల రాముడికి తాను స్నేహితుడనని పేర్కొంటూ, రామ్‌లాలా విరాజమాన్‌ను ఓ పార్టీగా చేస్తూ దేవకీనందన్ అగర్వాల్ అనే వ్యక్తి వేసిన కేసును కోర్టు పరిగణించింది.
*సుప్రీం కోర్టుకు వెళ్లడంతో ఐదుగురు జడ్జీలతో ఓ రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటుచేసి 40 రోజుల పాటు ఏకధాటిగా విచారణ జరిపారు.
* 1990ల్లో రామజన్మభూమి వివాదం పతాకస్థాయికి చేరింది. 1992 డిసెంబరు 6న లక్షలమంది కరసేవకులు బాబ్రీమసీదును నేలమట్టం చేశారు.
*ఇది ఈ వివాదాన్ని మరో మలుపు తిప్పింది. మసీదు విధ్వంసానికి దారితీసిన కారణాలపై జస్టిస్ మన్మోహన్‌సింగ్ లిబర్హాన్ కమిషన్ వేశారు.
*1992-2002 మధ్య అలహాబాద్ హైకోర్టులో వాదనలు చురుగ్గానే సాగాయి. మసీదు కింద ఆలయం ఉండేదా.. అన్న విషయాన్ని తేల్చాల్సిందిగా 2002లో అలహాబాద్ హైకోర్టు పురావస్తు శాఖను ఆదేశించింది. 2003లోనే ఏఎ్‌సఐ తన నివేదిక ఇచ్చినా ఆ తరువాత ఏడేళ్లపాటు కేసు అలా సాగుతూనే వచ్చింది.