భారత ఫొటో జర్నలిస్టులకు పులిట్జర్ పురస్కారం
Posted On May 06, 2020
- ప్రపంచవ్యాప్తంగా జర్నలిజంలో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం ‘పులిట్జర్ ప్రైజ్’ను ఈ ఏడాది జమ్మూ-కశ్మీర్‌కు చెందిన ముగ్గురు ఫొటో జర్నలిస్టులు గెల్చుకున్నారు.
- ఈ ముగ్గురు జర్నలిస్టులు ప్రస్తుతం అంతర్జాతీయ వార్తా సంస్థ ‘అసోసియేటెడ్ ప్రెస్’లో పనిచేస్తున్నారు.
- ఫీచర్ ఫొటోగ్రఫీ విభాగం కింద చన్ని ఆనంద్, ముక్తార్ ఖాన్, దార్ యాసిన్‌లు పులిట్జర్ ప్రైజ్ దక్కించుకున్నారు.
- జమ్మూ-కశ్మీర్ నుంచి ఈ పురస్కారాన్ని గెల్చుకోవడం ఇదే మొదటిసారి.
- ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రభుత్వం విధించిన ఆంక్షల సమయంలో జమ్మూకశ్మీర్ ప్రజల జీవన స్థితిగతుల్ని తమ చిత్రాల ద్వారా ప్రపంచానికి తెలియజేసినందుకుగానూ వారికి ఈ పురస్కారం దక్కింది.
- అలాస్కాలో ప్రజా భద్రత అంశంలో ఉన్న లోపాలను ప్రస్తావిస్తూ రాసిన కథనాలకు ‘ద యాంకరేజ్ డైలీ న్యూస్’, ‘ప్రొపబ్లికా’ మీడియా సంస్థలకు ‘పబ్లిక్ సర్వీస్’ విభాగంలో పులిట్జర్ దక్కింది.
- న్యూయార్క్ నగర ట్యాక్సీ పరిశ్రమలో అవకతవకలను ఎత్తిచూపిన ‘ద న్యూయార్క్ టైమ్స్’ పత్రికకు పరిశోధనాత్మక పాత్రికేయ విభాగంలో బహుమతి లభించింది.
- వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వంపై ఈ పత్రిక రాసిన కథనాలకు ‘అంతర్జాతీయ రిపోర్టింగ్’ విభాగంలో పులిట్జర్ దక్కింది.
- తీవ్ర స్థాయి ఉష్ణోగ్రతల వల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని వివరిస్తూ ‘ద వాషింగ్టన్ పోస్ట్’ రాసిన కథనాలకు ‘వివరణాత్మక రిపోర్టింగ్’ కింద అవార్డు వరించింది.
- హాంకాంగ్‌లో నిరసనలపై ‘రాయిటర్స్’ వార్తా సంస్థ తీసిన ఫొటోలకు ‘న్యూస్ ఫొటోగ్రఫీ’ విభాగంలో పులిట్జర్ దక్కింది.