టైమ్ మేగజైన్ శక్తిమంతమైన మహిళల జాబితా
Posted On March 06, 2020
*టైమ్ మేగజైన్ ఇటీవల ప్రకటించిన ‘ప్రపంచంలోని వంద మంది శక్తిమంతమైన మహిళల జాబితా’లో భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ, స్వాతంత్ర సమరయోధురాలు అమృత్ కౌర్‌కు స్థానం లభించింది.
టైమ్ మేగజైన్ కవర్ పేజీపైచోటుసంపాదించుకున్నవారిలోవీరు గలరు.
అమృత్ కౌర్‌ను ---1947 సంవత్సరానికి,
ఇందిరా గాంధీని -----1976 ఏడాదికి ‘విమెన్ ఆఫ్ ద ఇయర్’గా ప్రకటించింది.
* స్వాతంత్ర సమరయోధురాలు అమృత్ కౌర్ 1889, ఫిబ్రవరి 2న కపూర్తలా రాచకుటుంబంలో జన్మించారు.
*లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న ఆమె 1918లో స్వదేశానికి తిరిగొచ్చారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితమై, ఆయన బాటలో నడిచారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఆమె పదేళ్ల పాటు ఆరోగ్య మంత్రిగా పనిచేశారు.