ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా తిరుమూర్తి
Posted On May 01, 2020
ఐక్యరాజ్య సమితి (యూఎన్)లో భారత శాశ్వత ప్రతినిధిగా టీఎస్ తిరుమూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు తిరుమూర్తిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 29న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తిరుమూర్తి విదే శీ వ్యవ హారాల మంత్రిత్వ శాఖ సెక్రటరీగా పని చేస్తున్నారు. 1985 ఐఎఫ్‌ఎస్ బ్యాచ్‌కు చెందినవారు. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా ఇప్పటివరకు సేవలందిస్తున్న సయ్యద్ అక్బరుద్దీన్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
అలాగే ఆస్ట్రేలియా భారత రాయబారిగా జైదీప్ మజుందార్‌ను, జాయింట్ సెక్రటరీ దీపక్ మిట్టల్‌ను ఖతార్‌లో భారత రాయబారిగా నియమించారు.