గిరిజన నృత్యాలు
Posted On February 08, 2020
సాధారణంగా తెలంగాణలోని గిరిజనులు వివిధ సందర్బములో వివిధ నృత్యాలు చేస్తారు అవి
1. థింసా -పెళ్లిళ్లు, పండుగలు, సందర్బాలలో ఈ నాట్యంను చేస్తారు. దీనిలో డప్పు, షహనాయ్, గుడుం, పిల్లనగ్రోవిని ఉపయోగి స్తారు
2. సవరలు - రుతువులు, పరిస్థితి అనుగుణంగా చేస్తారు నర్తకులు ఒకరి నడుము మరొకరు పట్టుకొని చేస్తారు సాయంత్రయం చేస్తే ఉరిచిగాడు అని, రాత్రి చేస్తే తగిలిగాడు అని పిలుస్తారు
3. లక్ష్మిదేవర - చెక్కలతో చేసిన గుఱ్ఱపు ముఖము ధరించి పూనకంతో నృత్యము చేస్తారు ఇంకొకరు పోతురాజు, కిష్టస్వామి ముఖము ధరించి నృత్యం చేస్తారు
4. కుర్రే - పంచ, బనియన్, ధరించి తలకట్టు కట్టుకొని, చేతిరుమాలు పట్టుకొని కాళ్లకు గజ్జెలు కట్టుకొని ,బృందనాయకుడితో అనుకరిస్తారు
5. రేలా.-భూమిపండుగ, ముత్యాలమ్మ పండుగ తాటిచెట్టు పండుగ తేలే పండుగకు వెన్నల రాత్రిలో చేస్తారు కొమ్ముల -పరికిణి శరీరానికి బనియన్ వుపయోగించి ప్రత్యేక అలంకరణ చేసుకొని, అడవిదున్నల పూసలు, కొమ్ములు, చీరలతో వెదురు బుట్టకు కొమ్ములు తగిలించుకొని తయారుచేసిన కిరిటం లాంటి దాన్నీ తలకు ధరిస్తారు మేడారం జాతరలో ఈనృత్యము చేస్తారు
6. గుస్సాడీ /దండారి -దీపావళికి ముందు 10రోజుల ముందు గ్రామాల్లో స్నేహ పూరిత సంబంధాలు మెరుగు పరచడానికి, సంస్కృతిని పరిరక్షించడానికి ఈనృత్యం చేస్తారు